షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలంటూ.. | Police Arrested Share Market Fraud Persons | Sakshi
Sakshi News home page

షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలంటూ..

Sep 13 2020 10:11 PM | Updated on Sep 13 2020 10:13 PM

Police Arrested Share Market Fraud Persons - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: షేర్ మార్కెట్‌లో మోసాలకు పాల్పడుతున్న 9 మంది నిందితులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తె షేర్‌ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నిందితులు నమ్మించారు. కాగా షేర్ మార్కెట్లో అనుభవం ఉందంటూ వనస్థలిపురంకు చెందిన ఓ ప్రయివేట్ ఉద్యోగితో రూ 9.60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.

ఈ నేపథ్యంలో టాప్ గ్లోబల్ రీసెర్చ్ కంపెనీ పేరుతో అమాయకులను మోసం చేసి లక్షల్లో వసూలు చేశారు. డబ్బులు తీసుకున్న తరువాత నిందుతులు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారు. అయితే మధ్యప్రదేశ్ నుండి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా రాచకొండ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  మరోవైపు నిందితులతో ఉన్న 13 కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు,18మొబైల్స్,17సిమ్ కార్డ్స్, 1ల్యాప్ టాప్,4 క్రెడిట్ కార్డ్స్, 1 వైఫై రూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Advertisement
 
Advertisement
Advertisement