బెయిల్‌.. అంతలోనే అరెస్టయిన ‌ప్రియామాధురి | Nutan Naidus Wife Released On Bail Arrested Again | Sakshi
Sakshi News home page

బెయిల్‌.. అంతలోనే అరెస్టయిన నూతన్‌నాయుడు భార్య

Oct 9 2020 8:20 AM | Updated on Oct 9 2020 10:01 AM

Nutan Naidus Wife Released On Bail Arrested Again - Sakshi

చీటింగ్‌ కేసులో పోలీసుల అదుపులో నూతన్‌నాయుడు భార్య

సాక్షి, పెందుర్తి: ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగిని మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, జనసేన పార్టీ సానుభూతి పరుడు నూతన్‌నాయుడు భార్య ప్రియామాధురిని పెందుర్తి పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. దాదాపు 40 రోజుల క్రితం దళిత యువకుడు శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో అరెస్ట్‌ అయిన ప్రియామాధురి గురువారమే బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, కొద్దిసేపటికే పెందుర్తి పోలీసులు చీటింగ్‌ కేసులో అరెస్ట్‌ చేసి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.

విశాఖ లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నూతన్‌నాయుడు దంపతులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడి వద్ద సుమారు రూ.25 లక్షలు వసూలు చేశారు. దీనిపై బాధితుడు రెండేళ్లుగా ఉద్యోగం కోసం అడుగుతున్నా ప్రియామాధురి పట్టించుకోలేదు. దీంతో కొద్దిరోజుల క్రితం బాధితుడు పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసి ఆమెను గురువారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ కె.అశోక్‌కుమార్‌ తెలిపారు.   (12 కోట్లు వసూలు చేసిన నూతన్‌ నాయుడు)

Advertisement
 
Advertisement
Advertisement