హారిక మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు | New Twist‌ BBA Student Harika Missing Case In East Godavari | Sakshi
Sakshi News home page

హారిక మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

Mar 29 2022 4:48 PM | Updated on Mar 29 2022 4:53 PM

New Twist‌ BBA Student Harika Missing Case In East Godavari - Sakshi

సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): పిఠాపురంలో అదృశ్యమైన విద్యార్థిని హారిక మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఉప్పాడ సెంటర్‌లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న హారిక విజివల్స్‌ సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. మూల మలుపు వద్ద బ్లూ కలర్‌ బస్సు ఎక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని..

అయితే హారిక అంతకు ముందు తాను ఆటోలో వస్తున్నానని.. ఆటో డ్రైవర్ ప్రవర్తన తేడాగా ఉందంటూ తన  స్నేహితురాలికి వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టింది. ఆ తర్వాత ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. అదే సమయంలో కొన్ని వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి లెఫ్ట్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. హారిక కోసం ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అదృశ్యమైన విద్యార్థిని బీబీఏ మూడవ సంవత్సరం చదువుతోంది. హాల్‌ టికెట్‌ కోసం హారిక పిఠాపురం నుంచి కాకినాడ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement