HYD: భారీగా స్టెరాయిడ్స్‌ స్వాధీనం | Narcotic Police Seized Steroids In Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: భారీగా స్టెరాయిడ్స్‌ స్వాధీనం

Sep 20 2024 9:41 PM | Updated on Sep 20 2024 9:41 PM

Narcotic Police Seized Steroids In Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ నగరంలో నార్కొటిక్స్ అధికారులు భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. కోఠిలోని స్టెరాయిడ్స్‌ డిస్ట్రిబ్యూటర్ రాకేష్ షాపులో డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్‌20) సోదాలు నిర్వహించారు. బాడీ బిల్డింగ్, జిమ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా స్టెరాయిడ్స్‌ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

 మియాపూర్‌లోని  శ్రీకాంత్ న్యూరో సెంటర్ లోను భారీగా స్టెరాయిడ్స్‌ పట్టుకున్నారు. రెండు చోట్ల 51 రకాల స్టెరాయిడ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. స్టెరాయిడ్స్‌ మొత్తం విలువ రూ.3లక్షలుంటుందని నార్కొటిక్‌ అధికారులు భావిస్తున్నారు. స్టెరాయిడ్స్‌ వల్ల కాలేయ వ్యాధులతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి.. ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్‌రావుకు బిగుస్తున్న ఉచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement