వ్యాపారి మధుసూదన్‌ రెడ్డి హత్యకేసు: ట్విస్ట్‌ ఏంటంటే.. | Sakshi
Sakshi News home page

వ్యాపారి మధుసూదన్‌ రెడ్డి హత్యకేసు: ట్విస్ట్‌ ఏంటంటే..

Published Mon, Aug 23 2021 11:28 AM

Mystery Behind Business Men Assasinate Tragedy In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యాపారి మధుసూదన్‌ రెడ్డి కిడ్నాప్‌, హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  వ్యాపారిని అతని స్నేహితులు గంజాయి మాఫియా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. కాగా, మధుసూదన్‌ రెడ్డి, సంజయ్‌, జగన్నాథ్‌లు కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో మధుసూదన్‌ రెడ్డి నుంచి రూ.40 లక్షలను సంజయ్‌ అప్పుగా తీసుకున్నాడు.

కొన్ని రోజులకి డబ్బు తిరిగి ఇవ్వాలని సంజయ్‌పై మధుసూదన్‌ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో.. నిందితులు బీదర్‌లో డబ్బు ఇస్తామని చెప్పి కారులో కిడ్నాప్‌ చేశారు. ఈ క్రమంలో.. పాతబస్తీ సమీపంలో మధుసూదన్‌రెడ్డిని హత్య చేశారు. ఆ తర్వాత సంగారెడ్డి సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో మధుసూదన్‌ రెడ్డి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు సంజయ్‌ పోలీసులు విచారణలో తెలిపాడు . 

చదవండి: తోటి స్నేహితులే కిరాతకంగా హత్య చేసి..  ఆపై..

Advertisement
 
Advertisement
 
Advertisement