గుంటూరులో లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల దుర్మరణం | Mother And Daughter Succumbs In Lorry Scooty Collision At Tenali | Sakshi
Sakshi News home page

గుంటూరులో లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల దుర్మరణం

Sep 14 2021 6:13 PM | Updated on Sep 14 2021 7:02 PM

Mother And Daughter Succumbs In Lorry Scooty Collision At Tenali - Sakshi

సాక్షి, గుంటూరు: తెనాలి మార్కెట్‌ యార్డులో లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లపైకి లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కూతురితోపాటు తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. కూతురిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement