నెల్లూరు: యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్‌ | Men Molested On Girl In Nellore | Sakshi
Sakshi News home page

Nellore: నమ్మి వెంటవస్తే.. కనికరం చూపని దుర్మార్గుడు..

Sep 15 2021 1:30 PM | Updated on Sep 15 2021 5:33 PM

Men Molested On Girl In Nellore - Sakshi

నెల్లూరు: నెల్లూరుజిల్లాలో యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి యువతిని కర్రతో కొడుతూ.. హింసిస్తున్న వీడియో ఒకటి వైరలయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు.. నెల్లూరుజిల్లా రామకోటయ్య నగర్‌కి చెందిన ఉష అనే యువతి పట్ల వెంకటేష్‌ అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వెంకటేష్‌ని అతడితో కలిసి నమ్మి నిర్జన ప్రాంతానికి వెళ్లిన ఉషను కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా కొట్టాడు. ఆమె గాజులు పగిలి రక్తం కారుతున్న ఆ దుర్మార్గుడు కనికరం చూపించలేదు. అంతటితో ఆగకుండా .. ఈ కీచక పర్వాన్ని అతని మిత్రుడితో వీడియో తీయించి పైశాచిక ఆనందాన్ని పొందాడు.

ఈ వీడియో వైరల్‌ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కలువాయి ప్రాంతంలో వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా మరో నిందితుడు శివకుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శివకుమార్‌పై గతంలో కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరిని కఠినంగా శిక్షించాలని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఎస్పీని కోరారు. 

చదవండి: సైదాబాద్‌ ఘటన దారుణం: కోమటిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement