విషాదం: లిఫ్ట్‌ అడిగి బైక్‌పై వెళ్తుండగా..  | Medak: Woman Fell Down And Died, While Going On Bike | Sakshi
Sakshi News home page

విషాదం: లిఫ్ట్‌ అడిగి బైక్‌పై వెళ్తుండగా.. 

Mar 20 2021 1:24 PM | Updated on Mar 20 2021 1:51 PM

Medak: Woman Fell Down And Died, While Going On Bike - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కౌడిపల్లి(మెదక్‌‌): లిఫ్ట్‌ అడిగి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కౌడిపల్లి మండలం రాయిలాపూలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రాజశేఖర్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రాయిలాపూర్‌ గ్రామానికి చెందిన కన్నారం భూషణం అతడి భార్య పుష్పమ్మ (42), అత్త తుడుం దుర్గమ్మతో కలిసి గ్రామ సమీపంలో తాళ్లగడ్డ తండా వెళ్లే రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ పొలం వద్ద కూరగాయలు తెంపేందుకు వెళ్లారు.

పని అయిపోయాక ఇంటికి వచ్చే క్రమంలో అటుగా పాలివాడైన గ్రామానికి చెందిన రాయెల్లి ప్రభాకర్‌  బైక్‌పై వస్తుండటంతో భూషణం అతన్ని లిఫ్ట్‌ అడిగి తన భార్య పుష్పమ్మను బైక్‌పై ఎక్కించి కూరగాయల గంపను  ఇచ్చాడు. ఇంటివద్ద దింపమని చెప్పాడు. కొద్దిదూరం రాగానే బైక్‌ అదుపుతప్పి కింద పడిపోయారు. బైక్‌ పైనుంచి పడిన వెంటనే పుష్పమ్మకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు భర్త భూషణం ఫిర్యాదు మేరకు బైక్‌ను అజాగ్రత్తగా నడిపిన రాయెల్లి ప్రభాకర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: భర్త చేష్టలతో విసుగుచెంది...
రాసలీలల కేసు: ఢిల్లీ నుంచి వీడియో అప్‌లోడ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement