అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి | Massive Bomb Blast In Northern Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి

Oct 8 2021 5:11 PM | Updated on Oct 8 2021 6:50 PM

Massive Bomb Blast In Northern Afghanistan - Sakshi

ఉత్తర ఆఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. కుందూస్‌ నగరంలోని షియా మసీదులో పేలుడు చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడులో 100 మందికి పైగా మృతిచెందారు.

కాబుల్‌: ఉత్తర అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. కుందూస్‌ నగరంలోని షియా మసీదులో పేలుడు చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడులో 100 మందికి పైగా మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు.శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు సంభవించింది. దాడికి పాల్పడింది ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖొరాసాన్‌గా అనుమానం వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా షియాలకు ఐసిస్‌ ఖొరాసాన్‌ హెచ్చరికలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐసిస్‌ ఖొరాసాన్‌.. తాలిబన్ల నాయకుడి తలనరికిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement