అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Married Woman Suspicious Death In Hyderabad - Sakshi

 ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు

సాక్షి, హస్తినాపురం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పిల్లగుంట్ల తండాకు చెందిన కవిత, విజయ్‌ దంపతులు ఇంజాపూర్‌ గ్రామంలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 18న కవిత కరోనాతో మృతి చెందిందని చెప్పి ఆమె భర్త విజయ్‌ చెప్పాడని కవిత కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని హుటాహుటినా గ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారన్నారు. 

అంత్యక్రియలలో పాల్గొన్న కవిత కుటుంబ సభ్యులు కరోనా టెస్ట్‌ చేయించుకుంటే అందరికీ నెగెటివ్‌ వచ్చింది. తమ కూతురిని పథకం ప్రకారం హత్య చేసి కరోనాతో చనిపోయిందని నమ్మించి మోసం చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నల్గొండ జిల్లా పిఏపల్లి మండల తహసీల్దార్‌ సమక్షంలో పాతిపెట్టిన కవిత మృదేహాన్ని పోలీసులు వెలికి తీసి సోమవారం పంచనామా చేశారు. రిపోర్ట్‌ వస్తే కవిత మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు.

చదవండి: రూ. 2 కోట్ల కోసం కిడ్నాప్‌.. కోవిడ్‌ శవంగా అంత్యక్రియలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top