ఆలస్యంగా నిద్రలేస్తున్నావని మందలించిన భర్త.. దీంతో

Married Woman escaped From Home In Medak District - Sakshi

సాక్షి, కంది(సంగారెడ్డి): భర్త మందలించాడని ఇంటి నుంచి వెళ్లిపోయింది ఓ భార్య. ఈ సంఘటన సంగారెడ్డి రురల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌ కథనం ప్రకారం.. కంది మండలం ఆరుట్ల గ్రామనికి చెందిన నిరూఢి పద్మ(50) అనారోగ్య కారణాలతో ఉదయం నిద్ర లేవకపోవడంతో తన భర్త నిరుడి జగయ్య(55) మందలించాడు.

దీంతో ఈ నెల ఒకటో తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం ఆమె కుమారుడు కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top