ప్రేమించి పెళ్లాడింది.. కానీ ఆరు నెలలకే.. | Married Woman Death Tragedy In Karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లాడింది.. కానీ ఆరు నెలలకే..

Jan 6 2022 7:28 AM | Updated on Jan 6 2022 7:28 AM

Married Woman Death Tragedy In Karnataka - Sakshi

పెళ్లి పీటలపై రాణి (ఫైల్‌)

సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఆరునెలల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్న యువతి విగతజీవిగా మారింది. ఈ ఘటన ఆనేకల్‌లో చోటుచేసుకుంది. జిగణి సమీపంలోని రాజాపుర నివాసి యశవంత్, బెంగళూరు టీచర్స్‌కాలనీ కి చెందిన రాణి (28) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

యశవంత్‌ ప్రభుత్వ ఉద్యోగి కాగా ఇతడికి ఇది రెండవ పెళ్లి. బుధవారం రాణి భర్త ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శవమైంది. భర్త, కుటుంబసభ్యులు కనీసం పట్టించుకోలేదు. కులాంతర పెళ్లి కావడంతో భర్త, అత్తమామలు చంపి ఉంటారని రాణి కుటుంబసభ్యులు ఆరోపించారు. జిగణి పోలీసులు కేసు నమోదు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement