పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగి.. ఇంట్లో ఎవరూలేని సమయంలో.. | Married Woman Commits Suicide In Nellore District | Sakshi
Sakshi News home page

పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగి.. ఇంట్లో ఎవరూలేని సమయంలో..

Feb 8 2022 4:06 PM | Updated on Feb 8 2022 4:07 PM

Married Woman Commits Suicide In Nellore District - Sakshi

పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగిన ఓ వివాహిత సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వజ్జవారిపాళెంలో సోమవారం చోటుచేసుకుంది.

ఓజిలి(నెల్లూరు జిల్లా): పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగిన ఓ వివాహిత సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వజ్జవారిపాళెంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని వజ్జవారిపాళెం గ్రామానికి చెందిన కొమ్మల సాగర్‌కు, మాధురి (35)కి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

చదవండి: రూ.లక్షల్లో బెట్టింగ్‌.. హార్స్‌ రేస్‌లాగే పావురాల రేస్‌.. ఇలా తీసుకొచ్చి.. చివరికి..

రెండురోజుల క్రితం మాధురి తన పుట్టింటికి పంపాలని భర్త సాగర్‌ను కోరింది. అయితే ప్రస్తుతం వద్దని అతను అడ్డు చెప్పడంతో వారిద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈక్రమంలో సోమవారం ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చుట్టపక్కల వారు గమనించి ఆమె భర్తకు సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో ఎస్సై శేఖర్‌బాబు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేటకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement