బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

Maoists Assassinated ASI Murali In Bijapur District - Sakshi

బందీగా ఉన్న ఏఎస్‌ఐ మురళీని హత్య చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బందీగా ఉన్న ఏఎస్‌ఐ మురళీని హత్య చేశారు. అనంతరం మురళీ మృతదేహాన్ని గంగుళూరు వద్ద రహదారిపై పడేశారు. మృతదేహం వద్ద ఒక లేఖను వదిలి వెళ్లారు. ఈ నెల 21న గంగుళూరు పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పలనార్ గ్రామంలో ఏఎస్‌ఐ మురళీని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి విదితమే. నాలుగు రోజుల తర్వాత కిడ్నాప్ ఘటన విషాదంతో ముగిసింది.

మురళీని విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు విన్నవించిన మావోయిస్టులు కనికరించలేదు. ఏఎస్‌ఐ విడుదలకు  గోండ్వానా సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ యత్నించిన సంగతి తెలిసిందే. చర్చలు జరిపే సమయంలోనే మురళీని మావోయిస్టులు  హత్య చేశారు.

చదవండి: కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో.. 
టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top