తిరువొత్తియూరు(తమిళనాడు): పెళ్లికి నిరాకరించిన ఓ ప్రియురాలు హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తిరుచి జిల్లా నొచ్చియం కొల్లడం నదిలో గత 11వ తేదీ 35 ఏళ్ల వయసు ఉన్న ఓ మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న శ్రీరంగం పోలీసులు విచారణ చేపట్టి లాల్‌గుడి సమీపంలోని పుల్లంపాడికి చెందిన సెల్విగా గుర్తించారు.
చదవండి: డ్రైవర్‌తో వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్తను మాట్లాడాలని పిలిచి..
ఈమె 7 నెలల క్రితం భర్త మృతి చెందడంతో ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. సెల్వి సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేయగా, లాల్‌గుడికి చెందిన ఫ్యాన్సీ స్టోర్ యజమాని నాగరాజు (53) తరచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా సెల్వితో వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది. పెళ్లి చేసుకుందామని సెల్విని కోరగా, అందుకు నిరాకరించిందని, దీంతో ఆమెను కొల్లిడం నది వద్దకు తీసుకెళ్లి ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసి, నదిలో పడేసి పారిపోయినట్లు నాగరాజు తెలిపాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment