Tamil Nadu Crime News: Acid Attack On Lover's Husband In Tamil Nadu Due To Illegal Relationship - Sakshi
Sakshi News home page

Extramarital Affair: డ్రైవర్‌తో వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్తను మాట్లాడాలని పిలిచి..

Jul 14 2022 7:48 AM | Updated on Jul 14 2022 11:29 AM

Acid Attack On Girlfriend Husband In Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు(తమిళనాడు): ఆంబూర్‌ సమీపంలో వివాహేతర ప్రియురాలి భర్తపై యాసిడ్‌ దాడి చేసిన జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని వళ్లిపట్టు ఏరి కాలనీకి చెందిన రామన్‌ (45) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని భార్య వేందామ్మాళ్‌ (40). వీరికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య విభేదాల కారణంగా ఏడాది నుంచి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. వేందామ్మాళ్‌ కంపెనీలో షూ కంపెనీలో పనిచేస్తోంది. రాణిపేటకు చెందిన జేసీబీ డ్రైవర్‌ శక్తివేలు (26)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రామన్, శక్తివేల్‌ను అడ్డుకున్నాడు.
చదవండి: సహోద్యోగినిపై కన్నేశాడు.. లిఫ్ట్‌ పేరుతో కారులో ఎక్కించుకుని..

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత తొమ్మిదో తేదీ శక్తివేలు, రామన్‌ను మాట్లాడాలంటూ పిలిచాడు. ఆంబూర్‌ సానాంకరై కన్నదాసన్‌ నగర సమీపంలోని శ్మశానం వద్దకు ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన శక్తివేల్‌ తాను తెచ్చుకున్న యాసిడ్‌ను రామన్‌ మీద పోశాడు. కేకలు విన్న స్థానికులు అతన్ని చికిత్స కోసం వాణియంబాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆంబూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి శక్తివేల్‌ను బుధవారం అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement