భార్యపై అనుమానం.. మద్యం సేవించి.. | Man Killed His Wife in Proddatur YSR Kadapa | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానం.. మద్యం సేవించి..

Mar 26 2022 10:02 AM | Updated on Mar 26 2022 10:03 AM

Man Killed His Wife in Proddatur YSR Kadapa - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : అనుమానం పెనుభూతంగా మారడంతో చింతాకు మాబున్ని (24) అనే వివాహితను భర్త హత్య చేసిన ఘటన కొత్తపల్లె పంచాయతి పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. రాజుపాళెం మండలంలోని వెంగళాయపల్లె గ్రామానికి చెందిన మాబున్నికి 11 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన దస్తగిరిబాషాతో వివాహమైంది. అతను ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రెండేళ్ల క్రితం కొత్తపల్లె బైపాస్‌ రోడ్డులోని ధనియాల ఫ్యాక్టరీలో మాబున్ని వాచ్‌మెన్‌గా చేరింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ ప్రాంగణంలోని ఇంట్లో వారు నివాసం ఉంటున్నారు. ఆమె తండ్రి సుబ్బరాయుడు కూడా పక్కనే ఉన్న రైస్‌మిల్లులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దస్తగిరిబాషా మద్యం సేవించి రోజూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో తండ్రి పరుగెత్తుకుంటూ వెళ్లాడు.

చదవండి: (నిర్మాత అని చెప్పి పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయమంటున్నాడు: సహాయనటి)

అప్పటికే మాబున్ని పైపునకు చుట్టిన చీరకు ఉరేసుకొని వేలాడుతోంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపాడు. తన కుమార్తెను భర్త దస్తగిరిబాషా గొంతుకు చీర కట్టి చంపేశాడని తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.  

మాబున్ని (ఫైల్‌)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement