చేపల కూరలో స్లో పాయిజన్‌.. అత్తా, మరదలిని | Man Fed Thallium In Fish Curry To In Laws In Delhi Arrested | Sakshi
Sakshi News home page

చేపల కూరలో స్లో పాయిజన్‌ కలిపి.. అత్తింటివారిని

Mar 25 2021 6:48 PM | Updated on Mar 25 2021 8:51 PM

Man Fed Thallium In Fish Curry To In Laws In Delhi Arrested - Sakshi

నిందితుడు వరుణ్‌ అరోరా(ఫొటో కర్టెసీ: ఎన్డీటీవీ)

ఏడాది జనవరిలో చేపల కూర వండి, అందులో థాలియం కలిపాడు. వారింటికి వెళ్లి అందరికీ కూర వడ్డించి తినాల్సిందిగా కోరాడు.

న్యూఢిల్లీ: అత్తింటివారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ వ్యక్తి భారీ కుట్ర పన్నాడు. భార్యతో పాటు అత్తామామలు, మరదలిని అంతమొందించేందుకు చేపల కూర వండి, వారికి తినిపించాడు. అందులో థాలియం అనే రసాయన మూలకాన్ని కలపడంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో నిందితుడి అత్త, మరదలు మృత్యువాత పడగా, భార్య, మామ చికిత్స పొందుతున్నారు. వివరాలు... వరుణ్‌ అరోరా(37) దక్షిణ ఢిల్లీవాసి. అతడికి కొన్నేళ్ల క్రితం దివ్య అనే మహిళతో వివాహం జరిగింది. 

అయితే, పెళ్లైన నాటి నుంచి తనను సరిగా పట్టించుకోవడంలేదనే అక్కసుతో వరుణ్‌ అత్తింటివాళ్లపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో చేపల కూర వండి, అందులో థాలియం కలిపాడు. వారింటికి వెళ్లి అందరికీ కూర వడ్డించి తినాల్సిందిగా కోరాడు. కాగా స్లో పాయిజన్‌లా పనిచేసే, థాలియం దుష్ప్రభావం అప్పటికపుడు తెలిసే వీలు లేనందున అంతా బాగానే ఉందని భావించారు బాధితులు. కానీ కొన్ని రోజుల తర్వాత వారి ఆరోగ్యంలో మార్పులు రాసాగాయి. జుట్టు ఊడటం, కాళ్లలో మంటలు పుట్టడం వంటి పరిణామాల బారిన పడ్డారు.

ఈ క్రమంలో వరుణ్‌ అత్త అనితా దేవి, మరదలు ప్రియాంక మృతిచెందారు. అతడి భార్య దివ్య సైతం తీవ్ర అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రిలో చేరింది. ఇక దివ్య తండ్రి మోహన్‌లో స్లో పాయిజన్‌ లక్షణాలు అంతగా కనిపించలేదు. ఇక అనిత, ప్రియాంక హఠాన్మరణాల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పగ తీర్చుకునేందుకు తానే చేపల కూరలో థాలియం కలిపానని, స్లో పాయిజన్‌ ద్వారా వారిని చంపడమే తన ఉద్దేశమని వరుణ్‌ అసలు విషయం బయటపెట్టాడు. కాగా ఫోరెన్సిక్‌ రిపోర్టులు, వరుణ్‌ ఇంట్లో దొరికిన ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు మంగళవారం అతడిని అరెస్టు చేశారు.

చదవండి: తొలి రాత్రే షాకిచ్చిన వధువు: రాడ్‌తో భర్తను కొట్టి..
రాసలీలల సీడీ కేసు: నిందితుడి భార్య అరెస్టు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement