ప్రేయసి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు ఆత్యహత్య

Man Ends His Life Over Love Deceased With Corona In Visakhapatnam - Sakshi

అక్కిరెడ్డిపాలెం(గాజువాక): ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గాజువాకలో బుధవారం చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన అమ్మాయి, గాజువాక దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి రోహిత్‌ కుమార్‌ (25) ప్రేమించుకున్నారు. రోహిత్‌కుమార్‌ గాజువాకలో ఒక హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు ప్రేమించిన అమ్మాయి కరోనాతో గుంటూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అప్పటినుంచి అతడు ముభావంగా ఉంటున్నాడు.

ప్రేమించిన అమ్మాయి లేని జీవితం తనకు వద్దనుకొని బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోహిత్‌ కణితి రోడ్డులోని తన రూమ్‌లో సీలింగ్‌ హుక్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దేశపాత్రునిపాలెంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top