భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో.. | Man departed by suicide after wife thrash him with broom | Sakshi
Sakshi News home page

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో..

Jul 26 2020 9:59 AM | Updated on Jul 26 2020 10:00 AM

Man departed by suicide after wife thrash him with broom - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కత్తా : భార్య చీపురు కట్టతో కట్టిందన్న అవమానంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్‌లో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌమిత్ర (45) అనే వ్యక్తికి, అతని భార్యకు ఓ విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాట పెరిగి ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో అతని అత్త (భార్య తల్లి) కూడా రంగం ప్రవేశం చేసింది. ఇద్దరూ కలిసి అతనిపై దాడికి దిగారు. చీపురు కట్టతో కొట్టి తీవ్రంగా అవమానించారు. దీంతో మానస్తాపం చెందిన సౌమిత్ర ఇంటి సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం అతని తల్లికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అలీపుర్‌దూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని స్టేషన్‌ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. (పరువు కోసం కూతుర్ని హతమార్చిన తండ్రి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement