కావలిలో దారుణం.. చిన్నారి గొంతు కోసిన సైకో | Man Cuts The Girl Throat In Nellore District | Sakshi
Sakshi News home page

కావలిలో దారుణం.. చిన్నారి గొంతు కోసిన సైకో

Feb 24 2023 8:06 AM | Updated on Feb 24 2023 8:30 AM

Man Cuts The Girl Throat In Nellore District - Sakshi

ఖాదర్‌బాషా

పిల్లలిద్దరినీ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఈ క్రమంలో మూడో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె పాఠశాల నుంచి వచ్చాక ఇంటి ముందు ఆడుకుంటోంది.

కావలి రూరల్‌(నెల్లూరు జిల్లా): పాఠశాల నుంచి ఇంటికి వచ్చి ఆడుకుంటున్న మూడో తరగతి బాలిక (8)ను గంజాయి మత్తులో ఖాదర్‌బాషా (30) అనే వ్యక్తి గొంతు కోసిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో కలకలం రేపింది. గురువారం రెండో పట్టణ ఎస్సై మాల్యాద్రి తెలిపిన వివరాల మేరకు.. కావలి వెంగళరావునగర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. బాలిక తండ్రి కొయ్య పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా­డు.

పిల్లలిద్దరినీ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఈ క్రమంలో మూడో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె పాఠశాల నుంచి వచ్చాక ఇంటి ముందు ఆడుకుంటోంది. ఇదే సమయంలో గంజాయి మ­త్తులో ఉన్న తుఫాన్‌నగర్‌కు చెందిన ఖాదర్‌బాషా అటుగా వెళుతూ బాలికను పిలిచి బ్లేడ్‌తో కిరాతకంగా గొంతుకోశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పరుగున బయటకు వచ్చి చూశారు.

చికిత్స నిమిత్తం బాలికను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. అక్కడే ఉన్న నిందితుడు ఖాదర్‌బాషా తానే బాలిక గొంతు కోశానని తల్లిదండ్రులకు చెప్పి పరారవుతుండడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మాల్యాద్రి తెలిపారు. కాగా బాలికకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఆమె గొంతుకు కట్లు వేసి ఇంటికి పంపారు.
చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది! 

Advertisement
 
Advertisement
Advertisement