పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు.. ఏకంగా 21 మందికి పైగా.. | Man Cheats 20 women in the name of Marriage held by police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు.. ఏకంగా 21 మందికి పైగా..

Dec 25 2022 7:47 AM | Updated on Dec 25 2022 11:31 AM

Man Cheats 20 women in the name of Marriage held by police - Sakshi

సాక్షి, చెన్నై: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకును తిరువణ్ణామలైలో స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందిన కార్తీక్‌ రాజా(26) ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి. విరుదునగర్‌ జిల్లా సాత్తూరు సమీపంలోని వల్లంపట్టికి చెందిన జాన్సీరాణి(20)ని ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు.

ఆ తర్వాత ఆమె వద్ద 5 సవర్ల చైన్‌ తీసుకుని విదేశానికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. భర్త గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో జాన్సిరాణీ ఏలాయిరమ్‌ పన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్తీక్‌ రాజా తిరువణ్ణామలై జిల్లాలో ఉన్నట్లు తెలుకుని పోలీసులు అక్కడికి వెళ్లి శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఏలాయిరమ్‌ పన్నై పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు.

ఇతను వివిధ గ్రామాలకు చెందిన 20 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని వారి నుంచి 80 సవర్లకు పైగా నగలు తీసుకున్నట్లు తెలిసింది. ఇతనిపై కోయంబత్తూరు, సాత్తూర్, ఏలాయిరమ్‌ పన్నై, విల్లుపురంతో పాటు పలు పట్టణాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement