బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం | Man Assault Attempt On Old Woman Anantapur District | Sakshi
Sakshi News home page

బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం

Dec 13 2021 3:42 PM | Updated on Dec 13 2021 3:42 PM

Man Assault Attempt On Old Woman Anantapur District - Sakshi

ఓ కామాంధుడు బరి తెగించాడు. 95 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. మండలంలోని ఓ తండాలో మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

అమడగూరు(అనంతపురం జిల్లా): ఓ కామాంధుడు బరి తెగించాడు. 95 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. మండలంలోని ఓ తండాలో మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తండాకు చెందిన వృద్ధురాలి కుటుంబసభ్యులు కూలి పనులకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామాంజులు నాయక్‌ మద్యం మత్తులో అత్యాచారయత్నం చేశాడు.

చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి..  

వృద్ధురాలి    అరుపులతో వెంటనే చుట్టుపక్కల వారు చేరుకుని నిందితుడిని చితకబాదారు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ విచారణ చేయలేదని బాధితురాలి మనువడు ఆవేదన వ్యక్తం చేశాడు. పలువురు టీడీపీ నాయకులు కేసు వద్దు, రాజీ చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు. ఎవరికీ ఇలాంటి అన్యాయం జరగరాదనే ఫిర్యాదు చేశానని, ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని కోరాడు.     

Advertisement
 
Advertisement
Advertisement