ట్రీట్‌మెంట్‌కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం

Man Allegedly Died Due To Upset Over Treatment At Delhi - Sakshi

యువకుడు తన అనారోగ్యానికి అయ్యే ఖర్చు విషయమై కలత చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆదర్శనగర్‌లోని ఓ హోటల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..నితేష్‌ అనే 25 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఐతే తన ట్రీట్‌మెంట్‌కి అయ్యే ఖర్చు తల్లిదండ్రులు భరించగలిగేది కాకపోవడంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ మేరకు ఆదర్శనగర్‌లోని ఓ హోటల్‌ బుక్‌ చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే రూమ్‌ బుక్‌ చేసుకుని మరీ ఒక ప్లాస్టిక్‌ సంచితో ముఖాన్ని చుట్టి ఒక చిన్న ఆక్సిజన్‌ సిలిండర్‌ని అనుసంధానించాడు.

దీంతో ఆ వ్యక్తి శరీరంలోకి చేరిని అధికమొత్తంలోని ఆక్సిజన్‌ ఒక్కసారిగా గుండె స్పందన రేటును పడిపోయేలా చేసి ప్రాణాంతకంగా మారి చనిపోయేలా చేస్తుంది. మృతుడిని నితేష్‌గా గుర్తించారు పోలీసులు. అతను సూసైడ్‌ నోట్‌ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని పేర్కొన్నాడు. దీని కోసం తాను తన తల్లిదండ్రులకు భారంగా మారకూడదని భావించే ఆ యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. 

(చదవండి: కాంచీపురం: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురి సజీవదహనం!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top