ఆ దుర్మార్గుడు దొరికాడు | Main accused in Budaun gang-rape arrested | Sakshi
Sakshi News home page

ఆ దుర్మార్గుడు దొరికాడు

Jan 8 2021 4:27 PM | Updated on Jan 9 2021 7:08 PM

Main accused in Budaun gang-rape arrested - Sakshi

సాక్షి, లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్, బదౌన్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో గత ఐదురోజులుగా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల పాటు గాలింపు తరువాత ఆలయ పూజారి సత్యనారాయణ్‌ (50) గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. ఉఘైతీ గ్రామ సమీపంలోని ఆడవిలో అతని అనుచరుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిందితుడు సత్య నారాయణ్‌ను ప్రశ్నిస్తున్నామని, వైద్య పరీక్షల అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుస్తామని సీనియర్‌ ఎస్పీ సంకల్ప్‌ శర్మ తెలిపారు.   (ఎన్‌సీడబ్ల్యు సభ్యురాలి అనుచిత వ్యాఖ్యలు : తాప్సీ ఫైర్‌)

కాగా ఈ నెల 3వ తేదీ ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయానికి వెళ్లిన బదౌన్‌కుచెందిన  50 ఏళ్ల మహిళపై ముగ్గురి వ్యక్తులు సామూహిక అత్యాచారానికి  పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తంకావడంతో యూపీ సర్కార్ ప్రత్యేక బ‌ృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ( కామాంధుల క్రూరత్వానికి పరాకాష్ట.. మహిళ మృతి )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement