స్నేహం ముసుగులో మైనర్‌పై అత్యాచారం, లైవ్‌ స్ట్రీమింగ్‌

Madhya Pradesh: 18 Year Old Girl Molested In Gwalior Live Stream To Friend - Sakshi

గ్వాలియర్‌: మధ్యప్రదేశ్‌లో అమానుషం దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్‌ నగరంలో  స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేగాక లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలను తమ మిత్రునికి లైవ్‌లో స్ట్రీమ్‌ చేసి రాక్షస ఆనందం పొందారు. ఏడాదిగా బాలికపై  అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే  ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించడంతో బాలిక భయపడిపోయింది.

ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే బాధితురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థమైంది. దీనిని అదునుగా భావించిన నిందితులు అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. బాలిక తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అ‍న్యాయంపై ఝాన్సీ రోడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మొదటగా  2021 జూన్‌ 2న ఓ హోటల్‌కు తీసుకెళ్లి తనపై అఘాయిత్యం చేశారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. 

లైంగికదాడి సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను తర్వాత వాళ్లు సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేశారని తెలిపింది.  అంతేగాక ఈ విషయం బయటకు చెబితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది. శుక్రవారం  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
చదవండి: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. మాట్లాడాలని పిలిచి మూడు రోజులు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top