ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. మాట్లాడాలని పిలిచి మూడు రోజులు..

Karnataka: Youth Molestation Lover Over Not Accepting Marriage - Sakshi

మైసూరు(బెంగళూరు): మైనర్‌ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఇంట్లో మూడురోజులు బంధించి అత్యాచారం చేశాడో కామాంధుడు. వివరాలు... హెచ్‌డి కోటె తాలూకాలోని కారాపురకి చెందిన నిందితుడు అరుణ్‌. మైసూరులో ఉండే 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టాడు. తల్లిదండ్రులు బాలికకు ఇటీవల వేరొకరితో నిశ్చితార్థం నిర్ణయించారు.

దీంతో అరుణ్‌ బాలికకు ఫోన్‌ చేసి నీతో మాట్లాడాలి అని చెప్పి మైసూరు నుంచి బాలికను తీసుకెళ్లి నంజనగూడులో ఉన్న తన పిన్నమ్మ అశ్విని ఇంటికి తెచ్చాడు. అక్కడ మూడురోజుల పాటు బాలికను ఉంచి తననే పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఆమె ఒప్పుకోక పోవడంతో అత్యాచారం చేశాడు. ఆమె దగ్గరున్న నగలను తీసుకుని బాల మందిరం వద్ద వదిలి వెళ్లాడు. బాల మందిరం వారి సహకారంతో బాలిక కుటుంబం చెంతకు చేరింది. నంజనగూడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇంతలో అరుణ్, అతనికి సహకరించిన పిన్నమ్మ అశ్విని, సోదరుడు అభి పరారయ్యారు.

చదవండి: అల్లరి చేస్తున్నాడని కొడితే.. ప్రాణమే పోయింది!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top