మూడేళ్ల ప్రేమ.. మరో అమ్మాయితో నిశ్చితార్థం.. యువతి ఇంటికి వెళ్లి..

Khammam: Girl Protest In Front Of Lover House For Marriage - Sakshi

సాక్షి,భద్రాచలం అర్బన్‌: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు సోమవారం ఆందోళన చేపట్టింది. బాధితురాలి కథనం ప్రకారం.. స్థానిక సీతారామనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న బాలసుబ్రహ్మణ్యం తన షాపులోనే పనిచేసే ఇందిరా ప్రియదర్శిని అనే యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు.

కాగా ఈ నెల 20న మరో యువతితో అతనికి నిశ్చితార్థం జరిగింది. దీంతో ప్రియదర్శిని బాలసుబ్రహ్మణ్యంను నిలదీసింది. అతని కుటుంబ సభ్యులకు విషయం వివరించింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 24న బాలసుబ్రహ్మణ్యం యువతి ఇంటికి వెళ్లి మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. కాగా మూడు రోజుల నుంచి సుబ్రహ్మణ్యం, అతని కుటుంబ సభ్యులు కన్పించకుండాపోయారు. అతని మొబైల్‌ కూడా స్విచాప్‌ వస్తోంది. దీంతో ఇందిరాప్రియదర్శిని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ధర్నా  చేపట్టింది. తనకు న్యాయం చేయాలని భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌కు ఫిర్యాదు చేసింది.

చదవండి: ఎంత పనిచేశావ్‌ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top