సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి..

Kanpur Woman Elopes With Boyfriend Father - Sakshi

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విచిత్రమైన ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రితో జంప్‌ అయ్యింది. ఏడాది క్రితం యువతిని ప్రియుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి కమలేష్‌తో పరిచయం కాగా, తర్వాత అతనితో ఆ యువతి పారిపోయింది.

కమలేష్ కుమారుడికి 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి తరచుగా ప్రియుడి ఇంటికి వచ్చేది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్‌తో ఆమెకు చనువు ఏర్పడింది. ఆ బంధం ప్రేమగా మారింది. వారు ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. 2022 మార్చిలో ఇంటి నుండి పరారీ అయ్యారు.
చదవండి: బెట్టింగ్‌లో భారీ నష్టం.. అయ్యో మధు!

యువతి కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు పెట్టారు. కమలేష్ కుమారుడిని పోలీసులు విచారించగా.. ఆ యువతి కమలేష్‌ను కలిసేందుకు వచ్చేదని కుమారుడు చెప్పడంతో నిజం వెలుగు చూసింది. ఏడాదిపాటు వేట సాగించిన పోలీసులు కమలేష్‌, ఆ యువతిని ఢిల్లీలో గుర్తించారు. కమలేష్, యువతి సహజీవనం సాగిస్తున్నారు. ఇష్టపూర్వకంగానే కమలేష్‌తో వెళ్లినట్లు యువతి చెప్పడంతో షాక్‌ అయిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top