breaking news
Kanpur woman
-
సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విచిత్రమైన ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రితో జంప్ అయ్యింది. ఏడాది క్రితం యువతిని ప్రియుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి కమలేష్‌తో పరిచయం కాగా, తర్వాత అతనితో ఆ యువతి పారిపోయింది. కమలేష్ కుమారుడికి 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి తరచుగా ప్రియుడి ఇంటికి వచ్చేది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్‌తో ఆమెకు చనువు ఏర్పడింది. ఆ బంధం ప్రేమగా మారింది. వారు ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. 2022 మార్చిలో ఇంటి నుండి పరారీ అయ్యారు. చదవండి: బెట్టింగ్‌లో భారీ నష్టం.. అయ్యో మధు! యువతి కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. కమలేష్ కుమారుడిని పోలీసులు విచారించగా.. ఆ యువతి కమలేష్‌ను కలిసేందుకు వచ్చేదని కుమారుడు చెప్పడంతో నిజం వెలుగు చూసింది. ఏడాదిపాటు వేట సాగించిన పోలీసులు కమలేష్, ఆ యువతిని ఢిల్లీలో గుర్తించారు. కమలేష్, యువతి సహజీవనం సాగిస్తున్నారు. ఇష్టపూర్వకంగానే కమలేష్‌తో వెళ్లినట్లు యువతి చెప్పడంతో షాక్ అయిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని.. -
ఏటీఎం క్యూలైన్లో ప్రసవించిన మహిళ
-
'నాకు ఈ పెళ్లికొడుకు వద్దు'
కాన్పూర్: మాట నిలబెట్టుకోలేని వరుడిని పెళ్లిపీటల మీదే తిరస్కరించిందో యువతి. తనకు తగిన మరో వరుడితో అదే పెళ్లిపందిల్లో తాళి కట్టించుకుంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆదివారం ఈ ఆసక్తికర పెళ్లి జరిగింది. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సామూహిక వివాహాల్లో నేహా అనే యువతి పెళ్లికి సిద్ధమైంది. అయితే పెళ్లికి ముందే ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తానన్న హామీని వరుడు నిలుపుకోలేకపోయాడు. దీంతో అతడిని పెళ్లాడేందుకు నేహా నిరాకరించింది. అతడిని పెళ్లిచేసుకోనని తెగేసి చెప్పింది. అదే పెళ్లిపందిట్లో తనను పెళ్లాడేందుకు ముందుకు వచ్చిన మరో యువకుడిని ఆమె పెళ్లాడింది. అతడి ఇంట్లో టాయిలెట్ ఉండడంతో వివాహం చేసుకుంది. ఇంట్లో మరుగుదొడ్డి అనేది కనీస అవసరమని నేహా పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'స్వచ్ఛ భారత్' నుంచి ప్రేరణ పొందాలని సూచించింది.