'నాకు ఈ పెళ్లికొడుకు వద్దు' | Kanpur woman called off her wedding with a man after he failed to get a toilet built at his residence | Sakshi
Sakshi News home page

'నాకు ఈ పెళ్లికొడుకు వద్దు'

Apr 18 2016 9:32 AM | Updated on Aug 28 2018 5:25 PM

'నాకు ఈ పెళ్లికొడుకు వద్దు' - Sakshi

'నాకు ఈ పెళ్లికొడుకు వద్దు'

మాట నిలబెట్టుకోలేని వరుడిని పెళ్లిపీటల మీదే తిరస్కరించిందో యువతి.

కాన్పూర్: మాట నిలబెట్టుకోలేని వరుడిని పెళ్లిపీటల మీదే తిరస్కరించిందో యువతి. తనకు తగిన మరో వరుడితో అదే పెళ్లిపందిల్లో తాళి కట్టించుకుంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆదివారం ఈ ఆసక్తికర పెళ్లి జరిగింది. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సామూహిక వివాహాల్లో నేహా అనే యువతి పెళ్లికి సిద్ధమైంది. అయితే పెళ్లికి ముందే ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తానన్న హామీని వరుడు నిలుపుకోలేకపోయాడు. దీంతో అతడిని పెళ్లాడేందుకు నేహా నిరాకరించింది. అతడిని పెళ్లిచేసుకోనని తెగేసి చెప్పింది.

అదే పెళ్లిపందిట్లో తనను పెళ్లాడేందుకు ముందుకు వచ్చిన మరో యువకుడిని ఆమె పెళ్లాడింది. అతడి ఇంట్లో టాయిలెట్ ఉండడంతో వివాహం చేసుకుంది. ఇంట్లో మరుగుదొడ్డి అనేది కనీస అవసరమని నేహా పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'స్వచ్ఛ భారత్' నుంచి ప్రేరణ పొందాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement