పోలీసులపై టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ అనుచరుల దాడి | Kadem ZPTC Followers Attack On Police At Nirmal District | Sakshi
Sakshi News home page

పోలీసులపై టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ అనుచరుల దాడి

Jun 5 2021 11:12 AM | Updated on Jun 5 2021 11:17 AM

Kadem ZPTC Followers Attack On Police At Nirmal District - Sakshi

సాక్షి, నిర్మల్‌: జిల్లాలోని కడెం మండలం లింగాపూర్‌ గామంలో టీఆర్‌ఎస్‌ వర్గీయులు పోలీసులుపై అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడికి తెగపడ్డారు. కడెం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అన్న భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోస్టుమార్టం లేకుండానే ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఖననం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు, కడెం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త పెద్దది కావటంతో శ్రీనివాసరెడ్డి అనుచరులు ఏఎస్‌ఐ సహా హోంగార్డుపై దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డితో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: Hyderabad: హైటెక్స్‌లో రేపు 40 వేల మందికి టీకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement