జీడిమెట్ల.. వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురు అరెస్ట్‌

Jeedimetla Police Raids On Prostitution And 3 Arrested - Sakshi

సాక్షి, జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం ని­ర్వహిస్తున్న ఇంటిపై జీ­డిమెట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ బాలరాజు వి­వరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదా­వరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కా­లనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అట్టి గృహంపై దాడి చేసి ని­ర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్‌­(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నా­రు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు.  
చదవండి: ఢిల్లీలో దారుణం.. ఇంటి ముందే బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top