జన్మించి నెల కూడా కాలేదు.. ఏడుస్తోందన్న కోపంతో కన్న తల్లే..

Ill Infant Baby Deceased After Mother Bangs His Head For Crying Kerala - Sakshi

కొచ్చి: శిశువు జన్మించి నెల కూడా కాకుండానే కర్కశంగా చంపేసిందో ఓ తల్లి. ఈ దారుణ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మొదట ఆ శిశువుకి ఆరోగ్యం సరిగాలేని కారణంగానే మరణించిందని అనుకున్నారు, కానీ ఆ తల్లి ప్రవర్తన పై అనుమానం రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అసలు నిజాలు బయటపెట్టారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెలలు పూర్తిగా నిండకుండానే జన్మించిన ఆ శిశువు ఆరోగ్య పరంగా చాలా బలహీనంగా ఉండేది. దీంతో కొన్నిరోజులుగా ఆ శిశువు అనారోగ్యంతో బాధపడుతోంది.

ఇక చేసేదేమి లేక ఆ బిడ్డ తల్లి శిశువుని తీసుకొని ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి, వారి సూచించిన మేరకు పలు పరీక్షలు, మందులు కూడా తీసుకుని ఇంటికి రావడం ఇదే పనిగా మారింది. అయినా ఆ శిశువుకి ఏ మాత్రం అనారోగ్యం తగ్గకపోవడం, మరో పక్క ఏడూస్తూనే ఉండడంతో బిడ్డ మరింతగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో మరో సారి ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా ఆ శిశువు తల్లి ఒక ఆశ్రమంలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆ ఆశ్రమం నడుపుతున్న ఫాదర్ జోజి థామస్‌కు శిశువు హఠాత్తుగా మరణించడంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తులో భాగంగా పోస్ట్‌మార్టం తర్వాత, ఒక పోలీసు అధికారి సర్జన్‌తో మాట్లాడగా, పిల్లవాడి తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు శిశువు తల్లిని విచారించగా... పసికందు తండ్రికి ఇదివరకే పెళ్లయిందని, ఈ విషయం తెలిసినప్పటికీ తాను అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఆ శిశువుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తాను కొంత మానసిక అసౌకర్యానికి గురైనట్లు, చివరికి కోపంతో తానే కొట్టడంతో శిశువు చనిపోయిందని అంగీకరించింది.

చదవండి: ఏమైందో..ఏమో? పిల్లలు నిద్రపోతుండగా గ్యాస్‌ సిలిండర్‌ బెడ్‌రూంలోకి తీసుకువచ్చి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top