కొత్త తరహా డ్రగ్‌ను పట్టుకున్న పోలీసులు | Hyderabad Police Arrested Drugs Gang | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Nov 19 2020 5:34 PM | Updated on Nov 19 2020 5:36 PM

Hyderabad Police Arrested Drugs Gang - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుదంటూ డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను సిటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పబ్‌లకు వచ్చే యువతను ఆకర్షించి డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌ ముఠా నుంచి 200 గ్రాముల మెఫిడ్రిన్‌ మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. పబ్బుల్లో పరిచయాలు పెంచుకొని డ్రగ్స్‌ విక్రయాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. ముంబై నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రముఖ హోటల్‌లో పని చేసిన చెఫ్‌ సలీమ్‌ను సూత్రధారిగా గుర్తించామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement