Hyderabad: కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లుకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. రీసైక్లింగ్‌ ముఠా గుట్టు రట్టు..

Hyderabad Police Arrest Expired Chocolate Biscuits Recycling Gang - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ బొడిప్పల్‌లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ  ముఠా కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లను రీసైకిల్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ఎక్స్‌పైర్ అయిన వస్తువులు, ఆహార పదార్థాలను సేకరించి వాటికే కొత్త లేబుల్స్ వేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తోంది.

సబ్బులు, షాంపులు, తిను బండారాలు వంటి వంటి మొత్తం 300 రకాల వస్తువులను ఈ ముఠా రీసైకిల్‌ చేసి భారీ మోసానికి పాల్పడటటేగాక.. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. 

హైదరాబాద్‌ శివార్లలోని గోదాములు, కోఠిలోని హరిహంత్ కార్పోరేషన్‌ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేయగా ఈ రీసైక్లింగ్‌ ముఠా బాగోతం బట్టబయలైంది. ఈ సోదాల్లో రూ.కోట్లు విలువ చేసే ఆహారపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top