Hyderabad: Man Cheats Woman In The Name Of Love, Arrested - Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసం.. ఆరు నెలలుగా ప్రేమ.. శారీరకంగా లొంగదీసుకొని..

Dec 16 2021 9:21 PM | Updated on Dec 17 2021 5:50 PM

Hyderabad: Man Cheats Woman In The Name Of Love, Arrested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పహాడీషరీఫ్‌(హైదరాబాద్‌): పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి యువతిని లోబర్చుకున్న యువకుడిని బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ బి.భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకుంట సాదత్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి, అదే ప్రాంతానికి చెందిన షేక్‌ అబ్దుల్లా బావజీర్‌(22) ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా లొంగదీసుకున్నాడు.
చదవండి: ఫోన్‌ మాట్లాడొద్దన్నా వినలేదు.. షాపుకు వెళ్లొస్తానని చెప్పి..

యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడుని అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
చదవండి: యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌.. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి..

Advertisement
 
Advertisement
Advertisement