ఫోన్‌ మాట్లాడొద్దన్నా వినలేదు.. షాపుకు వెళ్లొస్తానని చెప్పి.. | Young Women Missing In Amberpet Hyderabad | Sakshi
Sakshi News home page

ఫోన్‌ మాట్లాడొద్దన్నా వినలేదు.. షాపుకు వెళ్లొస్తానని చెప్పి..

Dec 16 2021 7:44 PM | Updated on Dec 16 2021 7:44 PM

Young Women Missing In Amberpet Hyderabad - Sakshi

పూజా రాణి (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌ (అంబర్‌పేట): షాపుకు వెళ్లొస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదశ్యమైంది. ఈ సంఘటన గురువారం అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో నివసించే మధుకర్‌ కుమార్తె పూజారాణి(20)  ఇంట్లోనే ఉంటుంది.

గత కొంత కాలంగా నిరంతరాయంగా ఫోన్‌లోనే మాట్లాడుతుండేది. ఇది సరైన పద్ధతి కాదని వారించినా వినలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం షాపుకు వెళ్లొస్తానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌.. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement