హైటెక్‌ దొంగతనం.. తెలివి మామూలుగా లేదుగా!

Hyderabad: Bullet Bike Chain Thefting In Madhapur Gachibowli - Sakshi

సాక్షి,గచ్చిబౌలి:  బైక్‌ దొంగలు, చైన్‌ స్నాచర్ల  తెలివితేటలు అంతా ఇంతా కాదు. ఒక వైపు చోరీలు చేస్తూనే పోలీసులకు చిక్కకుండా చతురత ప్రదర్శిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో చోటు చేసుకున్న చోరీలు నివ్వెర పరుస్తున్నాయి.  కొండాపూర్‌లో నివాసం ఉండె బీహర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరు రోజుల క్రితం  కూకట్‌పల్లిలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఆ సమయంలో స్థానికులు వెంటపడగా సెల్‌ ఫోన్‌ కిందపడిపోయింది. సెల్‌ ఫోన్‌ను కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. సెల్‌ ఫోన్‌ అడ్రస్‌ తెలుసుకున్న పోలీసులు ఆరువాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంచారు.

 ఆ తరువాత స్నాచర్‌.. కొండాపూర్‌లో కూరగాయల మార్కెట్‌కు వెళ్లగా తన సెల్‌ ఫోన్‌ పోయిందని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అది తమ ప్రాంతం కాదని పోలీసులు చెప్పడంతో  దాపూర్‌ పీఎస్‌కు భార్యతో కలిసి వెళ్లాడు. క్రైం పోలీసులు సెల్‌ ఫోన్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ ఉండటంతో దర్యాప్తు చేస్తామని చెప్పారు.  ఆ తరువాత కూకట్‌పల్లి పోలీసుల వద్దకు వెళ్లగా.. ఈ ఫోన్‌ ఎవరిదని అడగగా తనదేనని చెప్పాడు. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకొని కటకటాల పాలయ్యాడు.  
చదవండి: Hyderabad: కుండపోత.. సిటీలో రోజంతా వర్షం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top