ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాడు.. అదే బాలికకు శాపమై..

Haryana: Man Arrested For Raping Minor Girl In Palwal - Sakshi

తన అభ్యంతకర ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తానని బెదిరించి ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న హ‌ర్యానాలోని ప‌ల్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన విషయం మాట్లాడాలనే నెపంతో నిందితుడు జూన్‌లో బాధితురాలని సంప్రదించి, ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు.

ఇటీవల గ్రామంలోని క‌మ్యూనిటీ హాల్‌కు బాలికను పిలిచి ర‌హ‌స్యంగా త‌న ఫోటోలు తీసి మళ్లీ కలవడానికి నిరాకరిస్తే వాటిని సోషల్‌మీడియాలో షేర్ చేస్తానని ఆ నిందితుడు బెదిరించాడు. ఈ క్రమంలో జులై 20న, నిందితుడు బాలికను అర్ధరాత్రి బ్లాక్‌మెయిల్ చేసి తన కారులో గ్రామ శివారులోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లాడు. ఆపై తుపాకీతో బెదిరించి తనపై అత్యాచారం చేసి, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

అనంతరం అర్ధరాత్రి 1 గంటలకు ఆమెను ఇంటి సమీపంలో దించి అతను పరారయ్యాడు. ఈ దారుణం ఈ నెల జూలై 20న జరగినప్పటికీ, నిందితుడు తనను చంపేస్తానని బెదిరించడంతో బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. చివరికి కుటుంబ స‌భ్యుల‌కు ఇటీవ‌ల ఈ వ్య‌వ‌హారం చెప్ప‌డంతో వారు మ‌హిళా పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు గురుగ్రాంలో నిందితుడిని అరెస్ట్ చేసి అతని తుపాకీ, కారుని స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: ప్రే‘ముంచాడు’.. వీడు మామూలోడు కాదు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top