స్నేహితులతో కలిసి కన్న కూతురిపైనే అకృత్యం | Father Sentenced 60 Years Jail For Molesting Daughter Tamil Nadu | Sakshi
Sakshi News home page

స్నేహితులతో కలిసి కన్న కూతురిపై అకృత్యం: 60 ఏళ్ల జైలు

May 7 2021 12:52 PM | Updated on May 7 2021 2:10 PM

Father Sentenced 60 Years Jail For Molesting Daughter Tamil Nadu - Sakshi

టీ.నగర్‌ (తమిళనాడు): స్నేహితులతో కలిసి కన్నకూతురిపైనే సామూహిక లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి న్యాయస్థానం 60 ఏళ్ల జైలు, అతని స్నేహితులకు 40 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈరోడ్‌ జిల్లా గోబి సమీప గ్రామానికి చెందిన బాలిక(10) తండ్రి, తమ్ముడితో నివసిస్తోంది. తండ్రి చిత్రహింసలు భరించలేక ఆమె తల్లి ఎటో వెళ్లిపోయింది. 2019లో బాలిక తండ్రి, స్నేహితులు అరుణాచలం (35), మణికంఠన్‌ (33) కలిసి బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

స్థానికులు గోబి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన ఈరోడ్‌ జిల్లా మహిళా కోర్టు న్యాయమూర్తి మాలతి బుధవారం తీర్పు వెలువరించారు. బాలిక తండ్రికి మూడు సెక్షన్ల కింద 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే, మిగతా ఇద్దరికి రెండు సెక్షన్ల కింద 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 

చదవండి: విద్యార్థినికి అబార్షన్‌.. యువకుడికి యావజ్జీవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement