తండ్రి మరణించిన అరగంటకే కుమారుడు.. | Father Deceased After Few Minutes Son Deceased In Karimnagar District | Sakshi
Sakshi News home page

తండ్రి మరణించిన అరగంటకే కుమారుడు..

Jan 25 2021 11:21 AM | Updated on Jan 25 2021 1:44 PM

Father Deceased After Few Minutes Son Deceased In Karimnagar District - Sakshi

బస్వారెడ్డి (ఫైల్‌), వాసుదేవరెడ్డి (ఫైల్‌) 

ఓదెల (పెద్దపల్లి): తండ్రి మరణించిన అరగంటకే కొడుకు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం, ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ మాజీ చైర్మన్, పెద్దపల్లి జిల్లా పెద్దకొమిర గ్రామానికి చెందిన పల్కల బస్వారెడ్డి (78)కి భార్య సత్యవతి, కుమారులు వాసుదేవరెడ్డి, రమేశ్‌రెడ్డి, కూతురు ఉన్నారు. కొద్దిరోజులుగా బస్వారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని పెద్ద కొడుకు వాసుదేవరెడ్డి వద్ద ఉంటూ చికిత్స పొందుతున్నారు.

రెండ్రోజుల క్రితం వాసుదేవరెడ్డి కూడా తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న బస్వారెడ్డి ఆదివారం మరణించారు. తండ్రి మరణ వార్త విన్న వాసుదేవరెడ్డి (44) ఆసుపత్రిలోనే మృతిచెందాడు. ఒకేరోజు తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. రాత్రి స్వగ్రామంలో ఇద్దరి అంత్యక్రియలు జరిగాయి. వాసుదేవరెడ్డికి భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement