వివాహేతర సంబంధం: తల్లికి తెలియకుండా ఇంట్లోనే..

Extra Marital Affair: Daughter Theft Gold For Lover Karnataka - Sakshi

యలహంక(బెంగళూరు): ప్రియుని కోసం సొంత ఇంట్లోనే చోరీచేసిన కూతురిని తల్లి పోలీసులకు పట్టించింది. ఈ విచిత్ర సంఘటన అమృతహళ్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జక్కూరు లేఔట్‌లో దీప్తి (24) తల్లితో కలిసి జీవిస్తోంది. దీప్తి గతంలో భర్త నుంచి విడిపోయింది. ఆమె డ్రైవింగ్‌ నేర్చుకోవాలని వెళ్లి డ్రైవింగ్‌ స్కూల్‌లో మాస్టర్‌గా పనిచేస్తున్న మదన్‌ (27)తో వివాహేత సంబంధం ఏర్పడి షికార్లు చేయసాగారు.

విలాసాల కోసం దీప్తి తన తల్లికి చెందిన బంగారు నగలు ఒక్కటొక్కటిగా ప్రియునికి ఇచ్చింది. సుమారు కేజీ బంగారు నగలను తరలించింది. తల్లికి అనుమానం రాకుండా నకిలీ నగలను బీరువాలో పెట్టింది. నగలు తేడాగా కనపడడంతో తల్లి కూతురిని నిలదీసింది. చివరకు కూతురి మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దీప్తిని గట్టిగా విచారించగా మదన్‌కు ఇచ్చినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. 

చదవండి: ఇంట్లో చెత్త తోస్తుండగా.. వివాహితపై యజమాని లైంగిక దాడికి యత్నం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top