Drug peddler Tony: డ్రగ్‌ కేసు: టోనీ ఇచ్చిన సమాచారంతో మరో ఎనిమిది మంది అరెస్ట్‌

Drug Peddler Tony Police Custody Over, Latest Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ పెడ్లర్ టోనీ అయిదు రోజుల కస్టడీ బుధవారంతో ముగియనుంది. డ్రగ్‌ కేసులో నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంతో‚ డ్రగ్స్ కేసులో మరో ఎనిమిదిని హైదరాబాద్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు.  టోనికి వ్యాపార వేత్తలకు ఏజెంట్లుగా పనిచేసిన10 మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. టోనీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వివిధ రంగాలకు చెందిన పలువురిని పోలీసులు గుర్తించారు. అయితే టోనీతో డ్రగ్స్ లావాదేవీలు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  టోనీ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ సెల్, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు అతని కాల్ డేటా, డార్క్ నెట్ వెబ్‌సైట్‌, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా పరీశీలిస్తున్నారు. మూడు బ్యాంక్ ఎకౌంట్స్ ట్రాన్సెక్షన్స్ పరిశీలించిన పోలీసులు.. టోనీని మరోసారి కస్టడీలోకి కోరే అవకాశం ఉంది. 

పోలీసుల అదుపులో టోనీ అనుచరుడు అఫ్తాబ్.
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టోనీ ప్రధాన అనుచరుడు అఫ్తాబ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిని ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లో టోనీ డ్రగ్స్ లావాదేవీలను అఫ్తాబ్ పర్యవేక్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతని ఖాతాలో రోజుల వ్యవధిలోనే రూ.కోట్లలో లావాదేవీలు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అఫ్తాబ్ ఖాతాల్లో డబ్బులు పంపినవారి వివరాలను సేకరిస్తున్నారు . అఫ్తాబ్ ఫోన్ సీజ్ చేసి.. ఫోన్‌కాల్స్, మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

మరోవైపు డ్రగ్స్ వ్యాపారి టోనీకి కస్టమర్లుగా ఉన్న తొమ్మిది మంది వ్యాపారులను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం కొట్టివేసింది. డ్రగ్స్​కు సంబంధించిన కీలక విషయాలు తెలుసుకోవాల్సినందున టోనీ అతని కస్టమర్‌లు నిరంజన్ కుమార్ జైన్, సశ్వత్ జైన్, యజ్ఞనాద్ అగర్వాల్, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినీడి సాగర్, అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే  తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్టడీకి పంపేందుకు హైకోర్టు నిరాకరించింది.
చదవండి: హైదరాబాద్‌ టు ఢిల్లీ  ‘వందేభారత్‌’.. పింక్‌ బుక్‌లో ఏముందో..  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top