భార్యపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పీఆర్‌వో దాడి.. కేసు నమోదు, వీడియో వైరల్‌

Dowry Case Filed Against Minister Prashanth Reddy PRO Srikanth - Sakshi

మంథని(పెద్దపల్లి జిల్లా): భార్యాభర్తల వివాదంలో వ్యవసాయ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పీఆర్‌ఓగా చెప్పుకుంటున్న తోట శ్రీకాంత్‌పై మంథని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంథని ఎస్సై చంద్రకుమార్‌ వివరాల ప్రకారం.. మంథని మండలం గాజులపల్లికి చెందిన కోమలతతో కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఎదులాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌తో వివాహమైంది. రెండేళ్లుగా శ్రీకాంత్‌ కోమలతను కాపురానికి తీసుకెళ్లడం లేదు.

ఆదివారం ఎదులాపూర్‌లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. కోమలత గ్రామ çసర్పంచ్‌ వద్దకు పిలిపిస్తే శ్రీకాంత్‌ రాలేదు. భర్తతో కలిసి వెళ్లేందుకు కోమలత సిద్ధంకాగా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్‌ కోమలతపై చేయి చేసుకున్నాడు. కోమలత మంథని పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

ఇవీ చదవండి:
అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది ! 
పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..? 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top