Street Light Movie: పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..?

Film Producer Mamidala Srinivas Comments On Street Light Movie - Sakshi

పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి ఎలా మారిపోతారు, వారి క్రిమినల్‌ ఆలోచనలు ఎలా ఉంటాయి? తమ క్రైమ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ.. అమాయకుల జీవితాలతో ఎలా ఆడుకుంటారు? చీకట్లో, ముఖ్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలు ఏంటనేవి ‘స్ట్రీట్‌ లైట్‌’సినిమా ద్వారా చూపించబోతున్నాం’అని అన్నారు ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్. 

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ... క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీశాం. .ముందుగా మా సినిమాను ఓటిటి లో విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ ఓటీటీల వలన కొద్దిమందికి మాత్రమే జీవనోపాధి కలుగుతుంది. అదే ఒక థియేటర్ వలన ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుందనే ఆలోచనతో  ప్రస్తుత పరిస్థితుల దృష్టి లో ఉంచుకొని అందరూ కూడా తమ సినిమాలను థియేటర్స్ లలోనే విడుదల చేయాలని అందరికీ సవినయంగా తెలియ జేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా హిందీ  సెన్సార్ పూర్తి చేసుకొని తెలుగు సెన్సార్ కు వెళ్లబోతుంది.మా చిత్రాన్ని సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో  మా సినిమాను థియేటర్స్ లొనే విడుదల చేస్తున్నాం’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం విరించి; సినిమాటోగ్రఫీ : రవి కుమార్.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top