తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి.. | Doctor Molestation On Women Staff In Tamilnadu | Sakshi
Sakshi News home page

కీచక వైద్యులు.. తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం  

Nov 20 2021 9:20 AM | Updated on Nov 20 2021 9:26 AM

Doctor Molestation On Women Staff In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై(తమిళనాడు): పవిత్రమైన వృత్తిలో ఉన్న ఇద్దరు వైద్యులు అపవిత్ర చేష్టలకు పాల్పడ్డారు. సాటి మహిళా వైద్యురాళ్లపై అత్యారానికి పాల్పడ్డారు. వీడియో తీసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. చివరికి విధుల నుంచి డిస్మిస్‌ అయ్యి కటకటాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. కరోనా సమయంలో చాలా మంది వైద్యులు స్టార్‌ హోటల్‌లో 15 రోజుల క్వారంటైన్‌ను గడిపారు.

గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యురాళ్లు చెన్నై టీ నగర్‌లోని ఒక స్టార్‌ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. అదే హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న వెట్రిసెల్వన్‌ (35), మోహన్‌రాజ్‌  (28) ఇద్దరు మహిళా వైద్యురాళ్ల గదిలోకి ప్రవేశించారు. హతమారుస్తామని బెదిరించి అత్యారానికి పాల్పడ్డారు.

వీడియో తీసి పలుమార్లు లైంగికదాడులకు పాల్పడ్డారు. వేధింపులు తాళలేక ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌.. చెన్నై తేనాంపేట మహిళా పోలీస్‌లతో విచారణ జరిపించారు. ప్రాథమికంగా నేరం నిర్ధారణ కావడంతో వైద్యులు వెట్రిసెల్వన్, మోహన్‌రాజ్‌లను గురువారం రాత్రి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఇద్దరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా ఆరోగ్య, సంక్షేమశాఖ శుక్రవారం డిస్మిస్‌ ఉత్తర్వులు జారీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement