వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పినందుకు భార్యను రాడ్డుతో దారుణంగా..

A Doctor Assassinated His Wife With Iron Rod In Bihar - Sakshi

పాట్నా: బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది.  వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్నందుకు భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడో భర్త.  బీహార్‌లోని నలంద జిల్లాలో లాహేరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామ్‌చంద్రపురి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్‌ ధీరేంద్ర కుమార్‌తో సుమన్‌కు గత ఏడాది వివాహం జరిగింది. అయితే కుమార్‌ రూ.15 లక్షల కట్నం తీసుకురావాల్సిందిగా భార్య సుమన్‌ను బలవంతం చేశాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో  కుమార్‌పై భార్య వరకట్న వేధింపుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ​ 

దీంతో కుమార్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంటికి క్రమం తప్పకుండా ఆమెను తీసుకురావడంతో భార్య అడ్డుచెప్పింది.  అంతే ఇదే అదునుగా భావించిన నిందితుడు భార్యపై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సుమన్‌ అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

చదవండి: 
Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట!
‘ఎక్స్‌టార్షన్‌’ గ్యాంగ్‌.. బ్లాక్‌మెయిల్‌ చేసి రూ. 89 లక్షలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top