దారుణం: అవనిగడ్డలో వైద్యుడి హత్య

సాక్షి, కృష్ణా: జిల్లాలోని అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. శనివారం ఓ ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరిరావును గుర్తు తెలియని దుండగులు ఇంటిలోనే హతమార్చారు. బెడ్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఆయన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా హంతకులు జాగ్రత్తపడ్డట్లు తెలుస్తోంది. శ్రీహరిరావు కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. చదవండి: సీఎం కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి