చిన్న క్లూ లేకుండా ప్లాన్‌ చేసి భార్యను అంతమొందించాడు..కానీ చివరికి

Dentist Accused Of Killing Wife By Lacing Shake With Cyanide At US - Sakshi

చాలా తెలివిగా ప్లాన్‌ చేసి భార్యను కడతేర్చాడు. చివరికి వైద్యులు కూడా బ్రెయిన్‌ డెడ్‌తో ఆమె చనిపోయిందని డెత్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేశారు. ఐతే ఒక నెలలో మూడుసార్లు ఆస్పత్రి పాలై ఒకేలాంటి లక్షణాలను చూపించడంతో ప్రారంభమైన అనుమానమే..అసలు కుట్రని బయటపెట్టించి హంతకుడిని పట్టించేలా చేసింది. 

అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని క్రెయిగ్‌ అనే డెంటిస్ట్‌ భార్య ఏంజెలా సడెన్‌గా చనిపోయింది. వైద్యులు కూడా ఆమె బ్రెయిన్‌డెడ్‌ అన్నారు. ఐతే ఒకే నెలలో మూడు సార్లు ఆస్పత్రికి వెళ్లడం ఒకేలాంటి లక్షణాలను చూపించడం తదితరాలను పరిశీలించిన పోలీసులు అనుమానంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె మెడికల్‌ రిపోర్టు ఆధారంగా ఆమె శరరీంలో ఆర్సెనిక్‌ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

దీంతో పోలీసులు ఆమెను భర్తే హత్య చేశాడనే అనుమానంతో క్రెయిగ్‌ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అతను విచారణలో ఆమెకు క్రమం తప్పకుండా తానే స్వయంగా ప్రోటీన​ షేక్‌లు ఇస్తున్నట్లు తెలిపాడు. వాటిని తాగిన కొద్దిసేపటిలోనే అనారోగ్యానికి గురై ఆస్పత్రికి చేరడం జరిగందని, ఇలా మొత్తం మూడుసార్లు జరిగిందని పోలీసులు చెప్పారు. చివరిసారి ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయే పరిస్థితికి దారితీసిందన్నారు. అలాగే అతడు ఎలాంటి క్లూ లేకుండా ఎలాంటి విషంతో హతమార్చవచ్చో ఆన్‌లైన్‌లో పలుమార్లు శోధించినట్లు తెలిపారు.

ఎన్నిగ్రాములు సైనేడ్‌ కలిపితే పోస్ట్‌మార్టంలో గుర్తించలేరో తెలసుకుని మరీ ఈ దారుణానికి ఒడగట్టాడని చెప్పారు. అంతేగాదు భార్య రెండురోజుల్లో ఆస్పత్రిలో చేరుతుందనగా కూడా పోటాషియం సైనేడ్‌ని ఆర్డర్‌ చేసినట్లు తెలిపారు. ఏంజెలా సోదరి టోనీ కోఫోడ్ కూడా నిందితుడు క్రెయిగ్‌ టీనేజ్‌ నుంచే అశ్లీలతలకు బానిసయ్యాడని, చాలామంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపింది.

తన భార్య ఏంజెలాకు క్రెయిగ్‌ ఈ డ్రగ్‌ని సుమారు ఐదేళ్ల క్రితం నుంచి ఇస్తున్నట్లు చెపింది. అదీగాక అతడి భార్య ఏదో మత్తుమందు తాగినట్లు అనిపించిదంటూ తన భర్త మొబైల్‌కు మెసేజ్‌ చేసిందని కూడా పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు ఆ వ్యక్తిపై పలు ఆరోపణలు మోపి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంతవరకు కూడా తన ఆరుగురు పిల్లలను సైతం కలిసేందుకు వీలులేదని కోర్టు అతనికి స్పష్టం చేసింది.

(చదవండి: కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్‌..ఆ తర్వాత ఏం జరిగిందంటే..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top